చందన పూర్ లో పౌర హక్కుల దినోత్సవం

మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందన పూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి దళితులకు ఆలయాల ప్రవేశం పై ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవిశంకర్ గోదావరిఖని టూ టౌన్ ఎస్ఐ అహ్మదుల్లా, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



