కోమాలో ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి సాయం

హైదరాబాద్ (జనం సాక్షి); నిజామాబాద్ జిల్లా ముపాక ల్ మండలం నాగం పేటకు చెందిన సాయన్న వలస కార్మికుడిగా కథలో పనిచేస్తూ అనారోగ్యంతో కోమాల్లోకి వెళ్లడం జరిగింది. కంపెనీ యజమాన్యం కథ నుంచి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది అయితే తమకు ప్రైవేటు చికిత్స అందించే అధిక స్తోమత లేదని భార్యాపిల్లలు సీఎం రేవంత్ రెడ్డికి ఆదుకోవాలని కోరడంతో వెంటనే స్పందించి సాయన్నకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ జిఏడి ఎస్ వెంకట్రావు, సెక్షన్ ఆఫీసర్ చిట్టి బాబుకు ఆదేశించారు వారు వెంటనే సాయన్నకు నీ మ్స్ లో అడ్మిషన్ కొరకు అనుమతి మంజూరు చేయించారు. వెంటనే స్పందించి తమను ఆదుకున్నారని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.