శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రామారావు అన్నదానం : పాల్గొన్న దుద్దిల్ల శ్రీను బాబు
మంథని (జనంసాక్షి) : స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదివారహస్వామి ఆలయంలో ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ తనయుడు, యువ కాంగ్రెస్ నేత ఇనగంటి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాదరావు తనయుడు దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని భక్తులకు స్వయంగా తన చేతుల మీదుగా అన్నం వడ్డించారు. అంతకన్నా ముందు శ్రీను బాబు ఆదివరాహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.