చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ గా దేవర సమతవెంకట్ రెడ్డి

చేవెళ్ల,ఫిబ్రవరి 16 (జనంసాక్షి) చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్ గా దేవర సమతా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి మల్గారి జనార్దన్ రెడ్డి జారీచేసిన జారీ చేసిన ఎన్నికనిర్వహణాధికారికి ఒకరోజు ముందుగానే అందించడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30 లకు కాంగ్రెస్ కౌన్సిలర్ సభ్యులంతా మున్సిపల్ కార్యాలయంలోని సమావేశం హాలుకు చేరుకోవడం జరిగింది. మొదట సభ్యులు కౌన్సిలర్ గా ఎన్నికల అధికారి రంగారావు కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. చైర్పర్సన్ గా దేవర సమతా వెంకట్ రెడ్డి పేరును 15 వార్డు కౌన్సిలర్ బండారి శైలజా రెడ్డి ప్రతిపాదించగా, 14 వార్డ్ కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ బలపరిచారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా కాసుల రాములు గౌడ్ పేరును 8వ వార్డు కౌన్సిలర్ దావల్గారి గోపాల్ రెడ్డి ప్రతిపాదించగా, 11వ వార్డు కౌన్సిలర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి బలపరిచారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ చైర్మన్గా దేవర సమతా వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గా కాసుల రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్పర్సన్ కు సమత వెంకట్ రెడ్డినీ, వైస్ చైర్మన్ కాసుల రాములు గౌడ్ ను ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి వారికి ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. అనంతరం చైర్ పర్సన్ సమతవెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్ ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాహుల్ రామ్మోహన్, టీపీసీసీ కార్యదర్శి మల్గారు జనార్దన్ రెడ్డి, మొయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, డిసిసి ఉపాధ్యక్షుడు బండారి ఆగి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు వారిని పూల శాలువాలతో వారిని సన్మానించారు.



