20వ వార్డులో ఆ..నాయకుడు గెలిచెనా

 

 

 

 

 

ఆర్మూర్, జనవరి 27 ( జనం సాక్షి): గతంలో కౌన్సిలర్ గా గెలిచి పదవి పొందిన నాయకుడికి రాబోయే ఎన్నికల్లో 20 వ వార్డులో గెలవడని వార్డులో సర్వత్ర విమర్శ వ్యక్తం అవుతున్నాయి.
అభివృద్ధి విషయం పక్కన పెడితే ఆ..నాయకుడు ముసుగులో తన దందాలు చక్కబెట్టుకున్నాడు.వార్డులో బంధువుల గణం రేషన్ దందా మాఫియా,గతంలో దొంగతనం కేసు, ప్లాట్ల కబ్జాలో తన హస్తము ఉండి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. గతంలో అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఎలాంటి
సమస్య ఎదురైన తప్పించుకున్నాడు.ఇలాంటి నాయకుడికి మళ్లీ పోటీ చేసేందుకు పార్టీ మళ్లీ టికెట్ ఎలా ఇస్తుందో అర్థం కావడం లేదు.20వ వార్డులో పోటీ చేస్తున్న ఆ..నాయకుడికి సర్వేలో కూడా చివరి స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వకుండా పార్టీ పరువు కాపాడుకోవాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా వార్డుల్లో కొత్తగా నిర్మించిన ఇండ్ల విషయాల్లో తన ప్రమేయం లేనట్టు తలదూర్చి బాగానే దండుకున్నాడని కితాబు కూడా తనకు దక్కినట్లు సమాచారం.వార్డు ప్రజలు మరి ఇంతటి అసహనం వ్యక్తం చేస్తున్న నాయకుడికి పార్టీ టికెట్ ఇచ్చేందుకు సమాలోచన చేయాలని వార్డు ప్రజలు అంటున్నారు.