విమానాశ్రయంలో ఏడు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో 7.096 కిలోల హైడ్రోపోలిక్ వీడును డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.