నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు
తాండూరు (జనంసాక్షి): నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు లభిస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్. పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్. ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా రాజ్యాంగ పీఠికను కృష్ణవేణి కాన్సెప్ట్ హైస్కూల్లో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అన్నారు.విద్యార్థులు కష్టపడి చదువుకొని తమ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బంటారం భద్రేశ్వర్ జిల్లా కార్యదర్శి పాఠశాల యాజమాన్యం ప్రశాంత్ కుమార్, సతీష్ కుమార్, సిబ్బంది మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.