అంతా నా ఇష్టం – వరద కాలువను సైతం వదలం
శంషాబాద్, (జనంసాక్షి): హైడ్రాధికారులు హెచ్చరించిన చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేపట్టిన వారి నిర్మాణాలు కూల్చివేసిన మారని మనిషి తీరు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత స్థలమున్నా అయినా అది సరిపోనట్టు వరద కాలువలో నిర్మాణాలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీ అమాదుల్లా నగర్ రెవెన్యూ పరిధిలోని దావా చెరువులోకి వర్షాకాల సమయంలో కాలువల ద్వారా దావ చెరువులోకి నీరు వస్తుంది, అక్కడనుండి అలుగు పారుతూ 25 ఫీట్ల కాలువ ద్వారా మిగతా చెరువులోకి నీరు ఈ కాలువల ద్వారా వెళుతుంది. (25 ఫీట్ల) వరద కాలువలకు ఇరుపక్కల కడీలు పాతారు. ఈ కడిలను కేస్ రెడ్డి అని వ్యక్తి తన అనుచర వర్గాని పరమాయించడంతో వారు జెసిబి సహాయంతో కడీలను తొలగించి బౌండరీ వాళ్ళను నిర్మించే ప్రయత్నం చేశారు. చుట్టుముట్టు వ్యవసాయం చేస్తున్న రైతులు, గ్రామస్తులు, మాజీ సర్పంచ్ సతీష్ యాదవ్ తో కలిసి వరద కాలువ పనులను నిలిపివేశారు. వరద కాలువ ను ఆక్రమిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు, ఎంత పొలంఉన్న మీకు సరిపోదా చివరికి వరద కాలువను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పాటు పోలీసులకు మీడియా ప్రతినిధులకు సమాచారం అందివ్వడంతో నిర్మాణదారుల అనుచర వర్గం జెసిబి ని తీసుకొని తుర్రుమన్నారు. గ్రామస్తులు రైతులు పోలీస్ స్టేషన్లో వరద కాలువను కె ఎస్ రెడ్డి, తన అనుచర వర్గాంతో కబ్జాకు ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ అమ్మదుల్లా నగర్ రెవెన్యూ పరిధిలో వరద కాలువలు చెరువులో ఎఫ్టిఎల్లో గోదాములు, అక్రమ వెంచర్లు చేశారు. ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్నా వ్యక్తులపై హ్తె డ్రా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలిని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు.