పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

హైదరాబాద్ (జనంసాక్షి) : భారాస నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్స్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల కోసం గురువారం హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు. ఆ తర్వాత షకీల్ను విచారించే అవకాశముంది. షకీల్ కుమారుడు సాహిల్ గతంలో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పైనా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

తాజావార్తలు