డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త : సీఎం రేవంత్ రెడ్డి

 

 హైదరాబాద్ (జనం సాక్షి)బీ 2008 డీఎస్సీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించారు. నవంబర్ 8 లోపు అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నేను నీతో ప్రొఫార్మాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించింది. కాగా కాంట్రాక్టు పద్ధతిన డిఎస్సి 2008 అభ్యర్థులను తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డి ఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరడమే కాకుండా 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది.