మాజీ సర్పంచుల నిరసనకు మద్దతు తెలిపిన హరీష్ రావు అరెస్ట్

 

హైదరాబాద్ (జనం సాక్షి)బీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం మొండి నిద్ర వీడట్లేదని మండిపడ్డారు ,కేసీఆర్ నాయకత్వంలో సర్పంచులు భార్యా పిల్లల మీద ఉన్న బంగారం అమ్మి, అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి కొరకు పనులు చేశారన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే సర్పంచులను అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు .రాత్రిపూట దొంగల , టెర్రరిస్టుల లాగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. సర్పంచుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పోలీస్ స్టేషన్ ముందు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించి నిరసనకు దిగారు.