తప్పుడు ..పోస్టులు పెడితే.. చర్యలు .. తప్పవు

గాంధారి ఆగస్టు21 (జనంసాక్షి)గాంధారి ఎస్ ఐ ఆంజనేయులుకామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వాట్సప్ గ్రూపులలో సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గాంధారి ఎస్ ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. సంబంధించిన విషయాలను ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి విధంగా లేక అవమానపరిచే విధంగా ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విధంగా కొంతమంది వ్యక్తులు వారి యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మొదలగు సోషల్ మీడియాలలో మెసేజ్లను ఫోటోలను వీడియోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా నందు కుల మతాలను కించపరిచే విధంగా గాని వ్యక్తుల యొక్క ఆత్మ గౌరవాలను దెబ్బతీస్తే విధంగా గానీ లేక వ్యవస్థను నష్టపరిచే విధంగా గానీ లేక ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి విధముగా గాని ఎలాంటి పోస్టులను పోటులను వీడియోలను పెట్టకూడదని హెచ్చరించారు. ఒకవేళ అలా పెట్టిన యెడల వారిపై ఆ గ్రూప్ అడ్మిన్ పై చట్ట రిత్యా. చర్య తీసుకొన పడుతుందని అన్నారు. అంతే కాకుండా ఆ గ్రూపులో ఆ విషయాలపై, మెసేజ్లు చేసిన వారందరి పైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకో బడతాయని అన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లో వారి గ్రూపులో ఏం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పరిశీలించి, ఎవరైనా పై విధంగా తెలిపినట్లుగా, మెసేజ్ లు చేస్తే వెంటనే, ఆ గ్రూపును, మ్యూట్ చేస్తూ, డిలీట్ చేయాలని సూచించారు, అలా చేయని, చట్ట రిత్యా, తగిన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.