కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకుడి వేతన సమస్య పరిష్కారం

 

 

 

 

 

 

 

 

భీమదేవరపల్లి, ఆగస్టు 30 (సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కాంచనపల్లి రాజయ్య ఇటీవల ఎదుర్కొన్న వేతన సమస్యకు పరిష్కారం లభించింది.
వివరాల్లోకి వెళ్తే—ఈ ఏడాది జనవరిలో దేవాలయంలోనే మరో పూజారి నందనం సదయ్య ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయితే ఆ సమాచారం దేవాదాయ శాఖకు పంపే సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటున సదయ్య పేరుమీద కాకుండా రాజయ్య పేరునే మరణించినవారి జాబితాలో నమోదు చేశాడు.ఫలితంగా గత కొంతకాలంగా రాజయ్యకు రావలసిన నెలవారీ వేతనం నిలిపివేయబడింది.
వేతనం ఆగిపోవడంతో సమస్యను గమనించిన రాజయ్య, ఆలయ ఈవో కిషన్ రావు సహకారంతో హనుమకొండ దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించారు.వెంటనే అధికారులు పరిశీలనలో తప్పిదం బయటపడడంతో రాజయ్య పేరును సరిచేసి మళ్లీ వేతనాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ
నా సమస్యను తక్షణమే పరిష్కరించడానికి సహకరించిన ఆలయ ఈవో కిషన్ రావు కు హనుమకొండ దేవాదాయ శాఖ డి సి అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటారని నమ్ముతున్నాను అని తెలిపారు.