తెలంగాణలో రెండు రోజులు వానలు వాతావరణ శాఖ హెచ్చరిక

 

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని , ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని, దీనితో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.