వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు , (జనంసాక్షి): రైతులు దలారి బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం యాలాల్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి సిద్దమయ్యాయి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరుకానున్నారు. యాలాల మండలంలోని కొనుగోలు కేంద్రాలు దేవనూర్, విశ్వనాథ్ పూర్, యాలాల్, అదేవిధంగా సంగెం కుర్థు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు.

తాజావార్తలు