నేత్రపర్వంగా బద్రేశ్వరుని పల్లకిసేవ

తాండూరు (జనంసాక్షి): పట్టణ నడిబొడ్డున కోలువుదీరిన శ్రీబావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలలో బాగా ఐదురోజులపాటు బద్రేశ్వరుని పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో బాగంగా నే మంగళవారం నుంచి శనివారం ఉదయం వరకుబద్రేశ్వరుని పల్లకిసేవ పట్టణ పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఆలయ కమిటీ మరియు వీరశైవ సమాజం ,యువదళ్ సభ్యుల ఆద్వర్యంలో నేత్రపర్వంగా బద్రేశ్వరుని పల్లకిసేవ కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాయి. ఐదురోజుల పాటు రాత్రి 10గటలకు పల్లకిసేవ కోనసాగనుంది. భక్తీ పారవశంతో బద్రేశ్వరుని పల్లకిసేవ లో నృత్యాలు, భజనలు, సంకిర్తనలు ఆలపించారు. అదేవిధంగా పల్లకిసేవ లో విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తున్నాయి. చూపరులను ఇట్టే ఆకట్టుకున్నాయి. పట్టప్రజలు పల్లకిసేవ లో తరలివచ్చి కనులారా విక్షించారు.దీంతో భక్తి పారవశం నెలకొంది. ఈ నెల 19న శ్రీబావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం,20వతేది లంకాదాహనం‌ ,తదితర కార్యక్రమాలు నిహిస్తారు.ఈ జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బద్రేశ్వరుని కృపకు పాతృలు కాగలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు