పాస్పోర్టు రద్దు చేశారు, అమెరికాలో గ్రీన్ కార్డు, ఇండియాకు వస్తారా !

 

 హైదరాబాద్ (జనం సాక్షి); ఫోన్ టాపింగ్ కేసులో రాష్ట్రంలో సంచలనం సృష్టించి అక్రమ ఫోన్ టాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు విశ్వసనీయ సమాచారం వెళ్లడైంది. కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ తో ప్రభాకర్ రావు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ వ్యవహారం బయటికి రాగానే అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్ళిన ప్రభాకర్ రావు అప్పటినుంచి అక్కడే ఉన్నారు. ఈ కేసు కు సంబంధించి దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్టు చేయడంతో పాటు ఆయనపై ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆయన్ని అమెరికా నుంచి జరిపించే ప్రయత్నాలు చేస్తూ మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. జూన్ లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్య చికిత్స నిమిత్తం వెళ్లిన తాను వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని పేర్కొన్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తూ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి రప్పించే ప్రయత్నాన్ని గుమ్మరం చేశారు. ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరు అయినట్లు తెలుస్తున్న క్రమంలో ప్రభాకర్ రావు ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది . ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు లేవని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని భారత ఏంబాసి ద్వారా అక్కడ యంత్రాంగానికి సమాచారం చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు  చేసుకుంటాయో పోలీసు, మేధావి వర్గాల్లో ఏం జరుగుతుందో నన్న చర్చ కొనసాగుతుంది.