పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన స్తంభాలు ఎత్తివేత

రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ రైతుల పోరాటంతో ఆగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇటీవలే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సానుకూలత రావడంతో పెద్దధన్వాడ నుంచి శాశ్వతంగా ఎత్తివేస్తున్నట్టు స్పష్టమవుతోంది. శుక్రవారం పెద్దధన్వాడ ఫ్యాక్టరీ నిర్మించతలపెట్టిన స్థలంలో ఉన్నటువంటి కరెంట్ స్తంభాలను తొలగించారు. గతంలో అక్కడ విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు తీసుకొచ్చిన స్తంభాలు ప్రస్తుతం వెనక్కి తరలించడంతో ఫ్యాక్టరీ ఇక శాశ్వతంగా తరలిపోయినట్టేనని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


