క్రీడాకారులకు పుల్లెల గోపీచంద్ అభినందనలు

మల్కాజిగిరి,(జనంసాక్షి): జాతీయ వెటరన్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ  ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి, భారత్ బ్యాట్మింటన్  చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మంగళవారం అభినందించారు. గచ్చిబౌలిలోని  పుల్లెల గోపీచంద్ బ్యాట్మింటన్  అకాడమీలో మార్చి16 నుండి 23  గోవాలో జరిగిన నేషనల్ మాస్టర్స్  బ్యాట్మింటన్  టోర్నమెంట్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను బాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ జాయింట్ సెక్రెటరీ యు వి ఎన్ బాబు,కోశాధికారి కానూరు వంశీధర్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు.ఏవీఎస్ మూర్తి 60 ప్లస్ డబుల్స్ క్యాటగిరిలో బంగారు పతకం మరియు 60 ప్లస్ సింగిల్స్ లో రజితం,60 ప్లస్ మిక్స్ డబుల్స్ లో కాంశ్య పతకాలు  సాధించాడు.ఎస్ అప్పారావు 35 మిక్సడ్ డబుల్స్ కేటగిరి లో కాంశ్య పతకం సాధించాడు.ప్రభినో 35 ప్లస్ ఉమెన్స్ డబుల్స్ క్యాటగిరి లో రజితం మరియు మిక్స్ డ్ డబుల్స్ లో కాంశ్య పతకాలు సాధించారు. కమలాకర్ రావు 55 ప్లస్ మిక్సడబుల్స్ క్యాటగిరి లో కాంశ్య పతకం  సాధించాడు.రాజలింగం 75 ప్లస్ సింగిల్స్ క్యాటగిరి లో కాంశ్య పతకం  సాధించారు.నర్సయ్య 75 ప్లస్ డబుల్స్ క్యాటగిరి లో కాంశ్య పతకం సాధించారు.ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, క్రీడా పోటీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతొ పాటు పేరు ప్రఖ్యాతలు అందుతాయని వీరందరూ అంతర్జాతీయ బాడ్మింటన్ పోటీలలో కూడా పాల్గొని మన దేశానికీ పతకాలు సాధించాలని దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

తాజావార్తలు