రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానాన్ని రద్దు  చేయాలని వినతి

మల్కాజిగిరి,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడంతో  దస్తావేజులేఖర్లు రోడ్డున పడే అవకాశం ఉందని వెంటనే స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు షాపులను మూసివేసి మల్కాజిగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి సబ్ రిజిస్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణలో ప్రస్తుతం 22 సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అమలుపరిచి స్లాట్ బుకింగ్ కొనసాగిస్తున్న తీరు బాధాకరమని, సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకొని దస్తావేజులు తయారు చేయడంతో పాటు ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న దస్తావేజు లేఖరులతో సహా న్యాయవాదులు ఇతరులు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్లాట్ బుకింగ్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చేకొండ నరేష్ బాబు,వంశీ,కుమారి, మురళి, కమల్ రాజ్, ఫారూఖ్, కేపీ ప్రసాద్, భార్గవ్ రామ్, రూప, జ్యోతి శంకర్, సుధీర్ యాదవ్, సంతోష్ యాదవ్, వారణాసి ప్రశాంత్, మునిపాల అనిల్, చలాన్ కృష్ణ, నజీర్, ఈశ్వర్, రామిరెడ్డి, యూసుఫ్, సంతోష్ జైన్, కృష్ణ, రాజశేఖర్, సాయి నరేష్, ఉడత నవీన్, జనార్ధన్, సుమన్, సాయి సుందరి, రాజు ముదిరాజ్, సూర్య కుమారి, సుందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు