జనంసాక్షి కథనానికి స్పందన..వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
బొంరాస్ పేట, (జనంసాక్షి): బొంరాస్ పేట మండలంలో అకాల వర్షాలు..అన్నదాత కుదేలు ఇంకా ప్రారంభం కాని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అని జనం సాక్షి గురువారం కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు.శుక్రవారం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రైతు వేదిక భవనంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు గౌడ్,ఏపీఎం సాయన్నతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించుకొని మద్దతు ధర పొందాలన్నారు.గ్రామ మహిళ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు,వివోఏ రామచంద్రయ్య,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.