నీట్‌ అవకతవకలపై మాట్లాడరేం..!

` ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు ప్రథమ స్థానామా..?
` ఈ అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం
` విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
` భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై పోరాడుతుతా..
` రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌` యూజీ పరీక్ష` 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్‌ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్‌ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్‌ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్‌ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్‌ లీక్‌ నుండి విముక్తి చేస్తామని హావిూ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో విూ వాయిస్‌గా మారుతా. విూ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హావిూ ఇస్తున్నాను అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.