అకాల వర్షాలకు నీట మునిగిన వరి పంట-అయోమయంలో అన్నదాత
పెనుబల్లి, (జనం సాక్షి ): సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయానికి ప్రకృతి పగప్పటి తుపాను రూపంలో గాలి వానతో కోతకు వచ్చిన పంట నీటి పాలు అయ్యింది,పెనుబల్లి మండలంలో గాలి వానకు తడిసిన వరి పంట ఆగమాగం అవడంతో ఆరుగాలo కష్టపడిన రైతన్నపరిస్థితి అగమ్య గోచరంగాఉంది, గిట్టుబాటు ధర కోసంరైతు వ్యయ ప్రయాసలతో వరిపంటను కోసి దాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు సెంటర్లకు తరలించి అమ్మాలంటేఅక్కడ మొదలవుతుంది పెద్ద గండం ఐకేపి అధికారులను బ్రతిమాలి, బామాలి, వారి చేతిలో బరువు పెట్టి దాన్యానికి అడ్డ దిడ్డమైన వంకలు పెట్టకుండా సీరియల్ ప్రకారం కాటావేఇంచుకోవాలి, ఈ బాధలు ఓర్చుకోలేక కోసిన పంటను వెంటనే అమ్ముకుందామంటే మధ్యధ ళారీలు రైతన్న అవసరాలను ఆసరాగా చేసుకుని, ధాన్యాన్ని లేనిపోని వంకలు పెట్టి అతి తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను అదోగతి పాలు చేస్తున్నారు, రైతులు రేయనక, పగలనక కస్టపడితే,పంట చేతికందేసమయానికి ప్రకృతి ప్రకోపానికి గురై ధాన్యాన్ని పండిస్తే, చివరకు ఐకెపి కొనుగోలు సెంటర్ల, మధ్య దళారీల, ఆగడాలు, దోపిడీలను తట్టుకొని ధాన్యాన్ని అమ్ముకుంటే చివరకు చేసిన అప్పులు, పెట్టిన పెట్టుబడులు రాక రైతన్నలు రుణగ్రస్తులు అవుతున్నారు, పైసా ఖర్చు పెట్టకుండా వరి కోతల టైంలో మధ్యదళారీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు లాభపడుతున్నారు. అకాల వర్షాలకు చేతికి అంది వచ్చిన వరి పైరు పూర్తిగా నీళ్ళల్లో వాలిపోయి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించమని వ్యవసాయ అధికారులను రైతులు వేడుకున్నా కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పెనుబల్లి మండల బిజెపి కార్యదర్శి బొర్రా నరసింహారావు ఆరోపించారు.