వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు
సంగారెడ్డి , ( జనంసాక్షి): ఇరువర్గాల మధ్య, కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రెండు వర్గాలు గాని, గ్రూప్ ల మధ్య గాని, కుల, మతాల మధ్య గాని ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా విద్వేషాలు సృష్టిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెచ్చగొట్టే వాఖ్యలు చేసినా, సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెట్టిన, ఫార్వర్డ్ మెసేజ్ లు చేసిన ఉపేక్షించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని, కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.