అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షణకు టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 

 హైదరాబాద్ (జనం సాక్షి)బీ కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్ ప్యాకేజీ కింద ప్రత్యేకమైన బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి తో పాటు వెల్లూరు లోని గోల్డెన్ టెంపుల్ ను భక్తులు సందర్శించుకునే సౌకర్యాన్ని ఈ ప్యాకేజీ లో కల్పించినట్లు తెలిపారు.