ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారి
హైదరాబాద్ (జనం సాక్షి)బీసమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు పత్రాల్లో ఎంసీ,ఎన్ఆర్ (నో క్యాస్ట్ నో రిలీజియన్) కాలములను పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి పరిశీలించాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సర్వేలో వినియోగించే పత్రాల్లో కులం మతం వెల్లడించని వారి వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేక కాలములను ఏర్పాటు చేస్తే రాజ్యాంగం లోని అధికరణ 25 (1) ప్రకారము మనస్సాక్షికి నచ్చిన మతాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించే స్వేచ్ఛ ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, ఏం నిర్ణయం తీసుకుంటారో పిటిషనర్ కు సమాచారం అందించాలని కులం, మతం వెల్లడించని వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తెలియజేయాలంటూ సాధారణ పరిశీలన, సామాజిక సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శిలకు బీసీ కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక ,విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కుల, మతం వివరాలు వెల్లడించ వద్దనుకునే వారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలం పెట్టాలంటూ వచ్చిన వినతులను పరిగణలోనికి తీసుకోవ దాన్ని సవాలు చేస్తూ కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డి ఎల్ కృష్ణతోపాటు మహమ్మద్ వషీద్ పిటిషన్ దాఖలు చేశారు .దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కులం ,మతం వివరాలను వెల్లడించని వారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలం పెట్టాలంటూ గత నెల 29న, ఈనెల 1న అధికారులకు వినతిపత్రం సమర్పించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.