ఒంటిపూట బడులు నవంబర్ 6 నుంచి కారణమేంటంటే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నవంబర్ 6 నుంచి మూడు వారాలపాటు ప్రభుత్వ పాఠశాల లకు నిర్వహించనున్నారు. కారణమేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగలన సమగ్ర సర్వే నిర్వహిస్తున్నందున అధికారులు నవంబర్ ఆరవ తేదీ నుంచి మూడు వారాలు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహించనున్నారు. సామాజిక ,విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ స్థితిగతులపై కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలనే సర్కారు నిర్ణయంతో ప్రధానంగా పాఠశాలల పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు పాల్గొననున్న సందర్భంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్ సి సిబ్బంది , ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకో నున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.