కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించిన జలమండలి

 

 హైదరాబాద్ (జనం సాక్షి); బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ సుంకిశాల గోడ కూలిన ఘటనలో కాంట్రాక్టు సంస్థను బ్లాకు లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ చేసిన ఆరోపణలను జలమండలి ఖండించింది. ఈ సంఘటనకు సంబంధించి జలమండలితోపాటు ప్రత్యేకంగా రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిందని స్పష్టం చేసింది. నిర్ణీతసమయములో కాంట్రాక్టు పనులు పూర్తి చేయలేదని ఆ కారణంగా కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేసినట్లు తెలిపింది. కమిటీ పూర్తి నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జ లమండలి తెలిపింది. అలాగే కాలేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసి లోకి పంపించడానికి 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది మరో కుంభకోణం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. హిమాయత్ సాగర్ ,ఉస్మాన్ సాగర్ లకు పునరుజ్జీవం కల్పించేందుకే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి గోదావరి ఫేస్ టు పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపింది.