వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు (జనంసాక్షి):వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే
బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులు మంజూరు చేయడం ఎమ్మెల్యేగా నా భాద్యత అన్నారు.గ్రామాలలో త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా నూతన బోర్లు వేయించాలని అధికారులను సూచించారు. పైప్ లైన్లు మరమత్తులు, అవసరమైన ప్రదేశాలలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు,అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జీన్ గుర్తీ గ్రామంలో శ్రీరాముల వారి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానిక నాయకులు,సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన గ్రామాలలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్దిదారులకు మొదటి విడతగా డబ్బులు మంజూరు అయినట్లుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన అధికారులు.త్వరలో నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో నాయకుల సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రారంభించాలి ఎమ్మెల్యే.ముఖ్యంగా తాండూరు మున్సిపల్ పరిధిలో ఎస్.డి.ఎప్ పనులు త్వరగా ప్రారంభించేట్లు పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు.