కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కళ..సహాకారం

 

 

 

 

 

 

 

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 20(జనంసాక్షి)
తాండూర్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గంకు 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని,
కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడ చేయడం జరిగిందన్నారు.పూర్తిగా మౌళిక సదుపాయలు కల్పించిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితా సిద్దం చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుపేదలై ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన వారికీ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను కేటాయించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ ,మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ , కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.