జై భీమ్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించిన ఉప్పల
హైదరాబాద్ (జనంసాక్షి) : అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని అంబేడ్కర్ విగ్రహం నుండి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు జరుగు జై భీమ్ ర్యాలీ పోస్టర్ నీ నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భగా కమిటీ సభ్యులు ఉప్పల శ్రీనివాస్ గుప్తని ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించాలని కోరడం జరిగింది. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ప్రపంచ మేధావి, సామాజిక, రాజకీయ విప్లవకారుడు, మానవ హక్కుల ప్రదాత, మహోన్నత రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి , కుల నిర్మూలన సిద్ధాంతకర్త, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమ సమాజ స్వాప్నికుడు బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క మహేష్, మాదిగ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం కొటేష్, మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు మేడి ప్రసాద్, మాదిగ జేఏసీ యువజన రాష్ట్ర నాయకులు, కొత్తపల్లి అన్వేష్ మాదిగ జేఏసీ యువజన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.