కలుషిత మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్, జనం సాక్షి; నాసిరకమైన ఆహార పదార్థాలతో తయారు చేసినటువంటి మోమోస్ కారణంగానే రేష్మ బేగం అనే గృహిణి మృతిచెందిన కేసులో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందిన అల్మాస్ అనే వ్యక్తి చింతల బస్తీలో మోమోస్ నాసిరకమైన పదార్థాలతో తయారు చేసి బంజారాహిల్స్ లోని వారాంతపు సంతలో విక్రయించడంతో మోమోసు కొనుక్కొని తిన్న రేష్మ బేగం వెంటనే అపస్మానిక స్థితిలోనికి వెళ్ళిపోయింది, ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోవడం జరిగింది. మరో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు ఈ సంఘటన దృశ్య జిహెచ్ఎంసి అధికారులు మోమోస్ కేంద్రాలపై ముప్పేట దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మోమోసుని తయారు చేస్తున్నట్లు గుర్తించి 69 కేంద్రాల్లో నమోనాల సేకరించి పరీక్షల నిమిత్తం లాభకు పంపారు. నివేదికలు రాగానే మోమోస్ తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని ఎస్ పంకజ్ వెల్లడించారు.