యువత కాకూడదు మత్తుకుచిత్తు

ఇల్లందు, ఆగస్టు 1 (జనం సాక్షి న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రబాను ఆధ్వర్యంలో ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ తన సిబ్బంది తో కలిసి ఇల్లందు పట్టణ లో ఆంటీ నార్కోటిక్ డ్రగ్స్ డాగ్ టీంతో ముమ్మర తనిఖీలు నిర్వర్తించారు. మత్తు పదార్థాల వలన జరుగు నష్టాల పైన అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి మరియు అనుమానిత ప్రదేశాలైన బస్ స్టేషన్, వైన్ షాపులు, దాసరి గడ్డ ఏరియా లలో తనిఖీలు చేపట్టి మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ సూరి, ఏఎస్ఐ లు నాగేశ్వరరావు, అబ్దుల్ ఘని తోపాటు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

తాజావార్తలు