‘¬దా’ ముగిసిపోయిన అధ్యాయం

share on facebook

– ఎవరైనా ¬దాపై మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టేందుకే అవుతుంది
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
తిరుపతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అనేది ఇప్పటికీ ముగిసిపోయిన అధ్యాయమేనని, దాని గురించి ఎవరైనా మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈనెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మోదీ రాక సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం తిరుమలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం బీజేపీ అఖండ గెలుపు అన్నారు. రాష్ట్రంలో మాపై విషప్రచారం చేశారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ట్రాప్‌లో పడుతున్నావని నాడు చంద్రబాబును హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఏపీకి విభజన హావిూల అమలు చేస్తామని, ప్రత్యేక ¬దా బదులు ప్రత్యేక ప్యాకేజీ  ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వానికి రుచించలేదని, వచ్చే ప్రయోజనాలను కాదనుకొని ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీని దూషించేందుకే చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. కానీ చంద్రబాబు ప్రయోగం వికటించి అసలుకే మోసం తెచ్చుకున్నాడని కన్నా అన్నారు. ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పినా… మా మాట పట్టించుకోకుండా మాపై నిందలు మోపారని విమర్శించిన కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే నినాదానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. మేం చేసిన అభివృద్ధికి తగిన ప్రచారం లభించకపోవడం వల్లే ఏపీలో వెనుకబడ్డామని విశ్లేషించిన కన్నా… ప్రత్యేక ¬దా ముగిసిపోయిన అధ్యాయంమని స్పష్టం చేశారు. ¬దా గురించి ఇకపై ఎవరు మాట్లాడినా ప్రజలను మళ్లీ మభ్యపెట్టడమే అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సహకరింస్తామని, అదేవిధంగా పాలనలో ఎలాంటి తప్పులు దొర్లినా నిలదీస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

Other News

Comments are closed.