తెలంగాణలో అధికారమే తమ లక్ష్యం

share on facebook

కేవలం మున్సిపల్‌ ఎన్నికల కోసమే పోరాడడం లేదు: కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి):

తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని కేంద్రమంత్రి  కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమన్నారు. కేవలం మున్సిపల్‌ ఎన్‌ఇకల కోసమే బిజెఇ పోరాడదన్నారు. తమకు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయం అని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ టా/-గ్గం/ట్‌ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సోషల్‌ విూడియాలో జరగవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని మార్పుపై కిషన్‌ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి కేంద్రం పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ కట్టుకోవాలనేది వారి ఇష్టం విూద ఆధారపడి ఉంటుందన్నారు. నవ్యాంధ్ర రాజధాని మార్పుపై చర్చ నడుస్తున్న సమయంలో ఈ అంశంపై  కిషన్‌రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు.  తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్‌ అహంకార వైఖరికి నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Other News

Comments are closed.