రోజుకు 30వేలు కాదు..పదివేలే

దుర్గగుడి భక్తుల సంఖ్యను కుదించిన పాలకమండలి విజయవాడ,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  దుర్గగుడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వతేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. మొదట్లో 30 వేల మందిని రోజుకు అనుమతిస్తున్నట్లు ప్రకటన చేశారు. కోవిడ్‌ హెచ్చరికల నేపధ్యంలో రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. … వివరాలు

జడ్పీ సభ్యులుగా జడ్పీటిసిలు ప్రమాణం

విజయనగరం,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); జడ్పీ సభ్యులుగా జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. 34 మంది సభ్యుల చేత కలెక్టర్‌ సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు బొత్సా సత్యనారాయణ, పాముల పుష్పశ్రీ వాణి, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, మాధవి, ఎమ్మెల్యేలు హాజరైనారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. వైస్‌ … వివరాలు

డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారిన ఎపి: జివి

గుంటూరు,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఏపీని మాఫియా రాష్ట్రంలా తయారు చేశారని ధ్వజమెత్తారు. అఫ్ఘనిస్తాన్‌ నుంచి ఏపీకి నేరుగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని, జగన్‌ సీఎం అయిన మరుసటి రోజు నుంచే డ్రగ్స్‌ వ్యాపారం ప్రారంభమైందని ఆరోపించారు. డ్రగ్స్‌ … వివరాలు

ఎపిలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా మరో 1167 కరోనా కేసులు నమోదు అమరావతి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో కరోనా కేసులు శనివారం స్వల్పంగా తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో … వివరాలు

కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాంట్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో పవర్‌ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు పడి ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి … వివరాలు

అయ్యన్నపాత్రుడుపై ఎస్సీఎస్టీ కేసు

అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరుకు చెందిన న్యాయవాది వేముల ప్రసాద్‌ చేసిన ఫిర్యాదుతో అరండల్‌ పేట పోలీసులు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తమకు … వివరాలు

ప్రభుత్వ ఆధీనంలోకి ఎయిడెడ్‌ విద్యాసంస్థలు

ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని హైకోర్టు వ్యాఖ్య అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని … వివరాలు

శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

సర్వదర్శనం టిక్కెట్ల నిలిపివేతపై ఆగ్రహం తిరుపతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసంలో గురువరాం నుంచి ఉచిత దర్శనం టోకెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. విషయం తెలియక తిరుపతికి చేరుకున్న భక్తులు.. శ్రీనివాసం దగ్గర టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి బస్టాండ్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన … వివరాలు

దుగ్గిరాలలో కోరం లేకే వాయది: ఆళ్ల

గుంటూరు,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 8 మంది సభ్యులు హాజరయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన సభ్యులు రాకపోవడంతో కోరం లేదని వాయిదా వేశారని తెలిపారు. 9 మంది ఎంపీటీసీలు గెలిచినా టిడిపి ఎందుకు సమావేశానికి రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. … వివరాలు

జబీనా కులధృవీకరణ పత్రం తిరస్కరణ

గుంటూరు,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : టీడీపీ ఎంపీటీసీ జబీనా కుల ధృవీకరణ పత్రం తిరస్కరణకు గురైంది. సోమవారం కుల ధృవీకరణ పత్రం కోసం జబీనా దరఖాస్తు చేసుకున్నారు. కాగా తహశీల్దార్‌ మల్లేశ్వరి దాన్ని తిరస్కరించారు. దీంతో రేపు ఉదయం ఎంపీపీ ఎన్నికలలో పోటీకి జబీనాకు ఆటంకం ఏర్పడిరది. తహశీల్దార్‌ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. … వివరాలు