2024నాటికి ప్రతీ ఇంటికీ నల్లానీరు – ప్రధాని మోదీ

share on facebook

 

లక్నో,నవంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రావిూణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునాది రాయి వేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ప్రాజెక్టులతో విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లోని 42 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆయాగ్రామాలన్నింటిలో గ్రామ జల, పారిశుధ్య కమిటీలు, పాని సమితిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు నిర్వహణ బాధ్యతలు చూస్తారన్నారు. కాగా, ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.5,555.38 కోట్లు. ఈ ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

Other News

Comments are closed.