నల్లగొండ

ప్రేమ విఫలమైందని సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

– నల్గొండ జిల్లాలో ఘటన నల్గొండ, జూన్‌26(జ‌నం సాక్షి) : ప్రేమ విపలమైందన్న ఆవేదనతో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కిన సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లిలోని ఓ కళాశాలలో చదువుతున్న నాగార్జున, అదే కళాశాలకు చెందిన యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత నెలలో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు దేవరకొండ … వివరాలు

తదుపరి చైర్మన్‌గా వడ్త్య దేవేందర్‌ నాయక్‌?

నల్గొండ,జూన్‌26(జ‌నం సాక్షి): దేవరకొండ మున్సిపల్‌ తదుపరి చైర్మన్‌గా గతం నుంచి పోటీపడుతున్న వడ్త్య దేవేందర్‌నాయక్‌ అవకాశాలు మెరుగు పడ్డాయి. ఆయనే తదుపరి ఛైర్మన్‌ జాబితాలో ఉన్నట్లు పట్టణంలో చర్చ కొనసాగుతుంది. టిఆర్‌ఎస్‌ వర్గాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ఇప్పటికే కౌన్సిలర్లు సమావేశమై దేవేందర్‌ను చైర్మన్‌గా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 20వార్డులు ఉండగా ఇద్దరు … వివరాలు

స్కూలు బస్సుకు ప్రమాదం: విద్యార్థులకు తప్పిన ముప్పు

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు బయటపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలో జరిగింది. కనగల్‌ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చండూరులోగల గీతా విజ్ఞాన మందిరం పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత విద్యార్థులను ఇళ్ల వద్ద వదిలేందుకు వెళ్తుండగా కుమ్మరిగూడెం సవిూపంలోని కల్వర్టు బ్రిడ్జి వద్ద … వివరాలు

వాగ్దానాలు విస్మరించిన సిఎం కెసిఆర్‌

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ నాలుగేండ్ల పాలనలో ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్నరాజ్‌ అన్నారు. నిరుద్యోగ భృతి..ఉద్యోగ నియామకాలు అన్నీ బూటకమయ్యాయని అన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ లోని ఇందిరమ్మ కాలనిలో ఆయన ఇంటింటికి కాంగ్రెస్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇంటికి … వివరాలు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్‌ సిద్ధం

– మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నాడు – టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నల్గొండ, జూన్‌25(జ‌నం సాక్షి ) : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు వెకిలి, పిల్ల చేష్టలుగా టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అభివర్ణించారు. సోమవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారని … వివరాలు

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జూన్‌25(జ‌నం సాక్షి ):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ జిల్లా మంత్రి సహకారంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు … వివరాలు

కెసిఆర్‌ దూరదృష్టితోనే నిరంతర విద్యుత్‌

అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి రైతు సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: మంత్రి నల్గొండ,జూన్‌23(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ సమర్థ పాలనతో రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలోపే 24 గంటల విద్యుత్‌ సరఫరా దేశంలోనే తొలిసారి ప్రారంభించుకున్నామని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఆ తరవాత వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర అవసరాల … వివరాలు

మూసీకి కొత్తగేట్ల బిగింపుతో మారిన మూసీ స్థితిగతులు

వరద నీటితో మూసి ప్రాజెక్ట్‌కు జలకళ 70 కోట్ల రూపాయలతో కాల్వల ఆధునీకరణ నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): 55 ఏండ్ల మూసీ చరిత్రలో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూసి ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతుల ఇబ్బందుల్ని గుర్తించిన జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డి.. నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు … వివరాలు

ఎక్కువ మొక్కలు నాటిన వారికి అవార్డులు

ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి: కలెక్టర్‌ నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులకు సూచించారు. ఈ సంవత్సరం ఎక్కువ మొక్కలు నాటి వాటిని సంరక్షించిన వారికి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.గ్రామ పంచాయతీ హరిత రక్షణ కమిటీలు బలోపేతం చేసి … వివరాలు

ప్రైవేట్‌ బస్సు బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ,జూన్‌19(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లా వేములపల్లి మలుపు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. లక్ష్మీగాయత్రి ట్రావెల్స్‌ కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తోంది. మంగళవారం వేకువజామున వేగంగా ప్రయాణిస్తున్న బస్సు వేములపల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. … వివరాలు