హైదరాబాద్

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి.. సిద్ధంగా ఉండు

– తెలంగాణలో దొరలపాలన కొనసాగుతోంది – ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరేశాడు – సీఎంవో నుంచి ఎవరికీ అపాయింట్‌ మెంట్‌ ఉండదు – నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది – ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడు – కుమారుడికి పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి – హరీష్‌రావుకు అనుకూలంగా ఉన్నవారికి అసమ్మతిని రాజేస్తున్నారు – … వివరాలు

శృతి,సాగర్‌ల ఎన్‌కౌంటర్లపై సమాధానం ఇవ్వాలి: రాములమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్‌ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్‌ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని రాములమ్మ విమర్శించారు. చంపడం తప్పయితే అందులో ప్రభుత్వాలకు మినహాయింపు లేదని తెలుసుకోవాలని ఆమె సూచించారు.

స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌ రాజ్‌భవన్‌ వరకు స్మార్ట్‌ బైక్‌లపై వెళ్లారు. అంతకుముందు అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ … వివరాలు

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేయడంపై   షబ్బీర్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి బెయిల్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ జైళ్లకు భయపడదని, … వివరాలు

జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌

50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధించారు. భార్యా … వివరాలు

మెట్రోతో కాలుష్యం తగ్గుతుంది

ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మెట్రోను అందరూ తమదిగా భావించి ఉపయోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుందన్నారు. అతాగే నగరంలో కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో రైలు … వివరాలు

నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ యంత్రాంగం

హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పారిశుద్య పనులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అతిపెద్దదైన నిమజ్జనం ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు … వివరాలు

గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో ఉన్న పోలీస్‌  మృతి చెందారు. బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్‌ఐ గుండె పోటుతో దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం … వివరాలు

బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్‌ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి.  బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా ఫార్మా, మైనింగ్‌ ఆల్లా పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 6 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నించాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు … వివరాలు

అవిూర్‌పేట – ఎల్బీనగర్‌.. మెట్రో రైలు ప్రారంభం

– జెండాఊపి ప్రారంభించిన గవర్నర్‌ నర్సింహన్‌ – పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని,పద్మారావు – ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన గవర్నర్‌, మంత్రులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌ – అవిూర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. సోమవారం గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌, … వివరాలు