హైదరాబాద్

ప్రజల్లో స్పందన బాగుంది

  కూటమికి ఓటమి తప్పదన్న తలసాని హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ సనత్‌నగర్‌ అభ్యర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మాయా కూటమికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తలసానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక … వివరాలు

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: చిన్నారి సహా భర్యాభర్తలు మృతి

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటకేసర్‌ నుంచి కీసర వైపు అతి వేగంగా వస్తున్న కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలు, వారి మూడు నెలల పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు … వివరాలు

ధర్నాచౌక్‌ను పునరుద్దరిస్తూ.. హైకోర్టు ఆదేశాలు

– మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు – తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది. ఆరు వారాల పాటు ఈ తీర్పు అమల్లో … వివరాలు

గెలిచే అభ్యర్ధులకే.. అధిష్టానం టికెట్లు ఇచ్చింది

– కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు – కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చిందని, మిగిలిన స్థానాల్లోనూ గట్టి అభ్యర్ధులకే టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నీ … వివరాలు

శాంతి భద్రతల విషయంలో..  టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

– థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీకి భయమెందుకు? – రాహుల్‌ మొద్దబ్బాయి అన్న బాబుతో రాహుల్‌ పొత్తా! – బాబు అవకాశవాద రాజకీయాలతో తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారు – వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఆంద్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయంలో టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, టీడీపీ నేతలు ఆందోళనలు … వివరాలు

కోడి కత్తికేసులో.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

– రెండు వారాల్లో ఈకేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశం – ఎయిర్‌పోర్టులో భద్రతా లోపాలపై ఆగ్రహం – వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందించాలని సిట్‌ను ఆదేశించిన హైకోర్టు – కేసును రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. … వివరాలు

చంద్రబాబు కనుసన్నల్లోనే.. కాంగ్రెస్‌ తొలి జాబితా

– బాబు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది – కేసీఆర్‌ నాలుగేళ్లలో చేసింది శూన్యమే – బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం – బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అర్థరాత్రి ప్రకటించిన జాబితా చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ముద్ర స్పష్టంగా … వివరాలు

కూటమికి ఓట్లేస్తే.. అభివృద్ధిని కాలదన్నుకున్నట్లే

  – మన ప్రాజెక్టులను అడ్డుకొనే బాబుతో పొత్తా? – టికెట్లు పంపిణీ చేసుకోలేనోళ్లు పాలన ఎలా చేస్తారు – తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌ – ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : తెలంగాణలోని ప్రాజెక్టులకు అడ్డుపడే చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవటం … వివరాలు

17న తెలంగాణ బంద్‌

బిసిలకు అన్యాయం జరిగిందన్న కృష్ణయ్య హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మహా కూటమిలో అసంతృప్త సెగలు చల్లారడం లేదు. ఆశించిన టికెట్లు ఇవ్వలేదని ఆశావహులు ఓ వైపు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. జాబితాలో బిసి లకు అన్యాయం జరిగిందని బిసి సంఘం నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 65 మందిలో కేవలం 13 మందే బిసి లు ఉన్నారని ఆర్‌.కృష్ణయ్య … వివరాలు

శేరిలింగంపల్లిలో చిచ్చు

స్వతంత్రంగా పోటీ చేస్తానన్న భిక్షపతి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికపూడికి నిరసన సెగ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో చిచ్చురేగుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కోరారు. ఆ స్థానం తనకు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించారని… అయితే … వివరాలు