అంబికకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

తణుకు: పట్టణానికి చెందిన చక్రవిన్యాస కళాకారిణి 65 నిముషాలపాటు నిర్విరామంగా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పైడిపర్రులోని కాపు కల్యాణమండపంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణభారత చీఫ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చింతలపట్ల వెంకటాచారి సమక్షంలో అంబిక ఈ నృత్యం చేసింది. అనంతరం 2012 సంవత్సరానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అంబిక పేరును చేర్చుతున్నట్లు వెంకటాచారి ప్రకటించారు.