అన్నివర్గాల అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం  – అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం 

అలంపూర్ జనంసాక్షి (మార్చి 24)అన్నివర్గాల ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ పట్టణం లోషాదిఖానా  భవనం నిర్మాణం కొరకు 30లక్షలు, ఈద్గా ప్రహరీ నిర్మాణం కోసం 20 లక్షలు  నిధులను ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే మంజూరుచేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే అబ్రహం ను అలంపూర్ కు మైనారిటీ సోదరులకు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అలంపూర్ వచ్చారు. ఈసందర్బంగా
అలంపూర్ మున్సిపాల్టీ కేంద్రంలో మైనార్టీ నాయకులు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహంని ఘనంగా గజమాలతో  సత్కరించారు. మైనార్టీలకు షాదిఖాన భవన నిర్మాణంలో మిగిలిన పనుల   కొరకు 30 లక్షల రూపాయలు మరియు ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి 20 లక్షలు రూపాయలు మంజూరు  కృషి చేసిన ఎమ్మెల్యే కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమంమే బిఆరెయస్ పార్టీ ప్రభుత్వం మేనని త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, భవన నిర్మాణ పనులను మొదలు పెడుతారు అన్నారు.అని అలాగే మైనార్టీ వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీస్కొని వస్తే వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు మరియు మైనార్టీ నాయకులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..