అసెంబ్లీ ఆవరణలో అగ్నిమాపక కేంద్రానికి సన్నాహాలు

హైదరాబాద్‌: జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే స్థలాభావం, సిబ్బందికి వసతుల కల్పన విషయాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కేంద్రం ఏర్పాటు కాలేదు. నిన్నటి ప్రమాదం నేపథ్యంలో అందరి దృష్టి అగ్నిమాపక కేంద్రంపై పడింది. ఇంకా ఎందుకు ఏర్పాటు చేయాలేదని ఉన్నతాధికారులు ప్రశ్నించారు. దాంతో ఫైర్‌ డిపార్టుమెంటు అధికారులు ఇవాళ అసెంబ్లీ అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.