ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌ అని ఆయనను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఈ రోజు మింట్‌ కాంపౌండ్‌లో జయశంకర్‌ ప్రథమ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు వివిధ ప్రజాసంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు.