ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయరాదు- ప్రభుత్వ వైద్యులు రేవంత్
ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయరాదు- ప్రభుత్వ వైద్యులు రేవంత్
ఆళ్లపల్లి సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
పరిమితికి మించి ఆర్ఎంపీలు వైద్యం చేయరాదని స్థానిక ప్రభుత్వ వైద్యులు రేవంత్ అన్నారు. శనివారం ఆర్ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రేవంత్ మాట్లాడుతూ… పరిమితికి మించి ఆర్ఎంపీలు వైద్యం చేయరాదని సూచించారు. జ్వరాలు ఎవరికైనా ఉంటే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు పంపించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ,కేసులు నిర్ధారణ అయితే స్థానిక ప్రభుత్వాసుపత్రికి సమాచారం ఇవ్వాలని అన్నారు. లేనియెడల సంబంధిత ఆర్ఎంపి పై చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, ఎస్సై రతీష్, ఆర్ ఐ రామయ్య ,ఆర్ఎంపీలు పాల్గొన్నారు.