ఆర్.టి.ఐ , హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ తెలంగాణ రాష్ట్ర మీడియా కన్వీనర్ గా కమతం సురేష్ పటేల్ నియామకం

ఎల్బీనగర్ (జనంసాక్షి ) తమను  ఆర్టిఐ , హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ  ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పద్మా రావ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి వేదిక కన్వెన్షన్ హాల్లో  రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం అనంతరం కమిటీ సభ్యులకు జంగాలి ప్రశాంత్ చేతుల మీదుగా ఐడి కార్డులు , సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ జంగాలి చేతుల మీదుగా  కమతం సురేష్ పటేల్ ను ఆర్టిఐ అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ తెలంగాణ రాష్ట్ర మీడియా కన్వీనర్ గా నియమిస్తూ ఐడి కార్డ్ , సర్టిఫికెట్ అందజేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమతం సురేష్ పటేల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు ప్రశాంత్ జంగాలి కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక సమాజంలో ఆర్టీఐ గురించి అవగాహన లేని వారికి అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తానని, ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అవకతవకలను గుర్తించి వాటిపై పోరాడుతానని అన్నారు. సమాచార హక్కు చట్టం గురించి తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు తన వంతు సహాయ పడతానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు,  పాల్గొన్నా