ఇందిరమ్మబాట ముగించుకుని హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం

విజయవాడ: కృష్ణా జిల్లాలో మూడురోజుల ఇందిరమ్మబాట కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ చేరుకోవడానికి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే స్థానిక సింగ్‌నగర్‌లో జరగాల్సిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం రద్దవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.