ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ

` సైన్యంపై హమాస్‌ ఆర్‌పీజీ లాంచర్‌
` 24 మంది సైనికులు మృతి
గాజాస్ట్రిప్‌ (జనంసాక్షి):హమాస్‌తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 24 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడిరచింది.సెంట్రల్‌ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా.. సవిూపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ గ్రనేడ్‌ను ప్రయోగించింది. దాని ధాటికి మందుగుండు పేలిపోయింది. ఆ భవనాలు సైనికులపై కుప్పకూలాయి. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించడం ఇదే తొలిసారి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక విూడియా కథనాలు వెల్లడిరచాయి. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనుందని తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఇజ్రాయెల్‌ చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ యుద్ధంతో గాజాలోని 85 శాతం ప్రజలు తమ సొంతప్రాంతాలను వీడాల్సి వచ్చింది. ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస గణాంకాలు వెల్లడిరచాయి.అక్టోబర్‌ ఏడున హమాస్‌ ఉగ్రదాడి జరిపి, సుమారు 240 మందిని తన చెరలో బంధించింది. ప్రపంచదేశాల ప్రయత్నాలతో వారిలో కొందరు విడుదల కాగా.. దాదాపు 100 మంది బందీలుగానే ఉన్నారు. వారు విడుదలయ్యే వరకు, హమాస్‌పై విజయం సాధించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు చెప్తున్నారు. కాగా, హమాస్‌ చెరలో ఉన్న బందీల బంధువులు సోమవారం ఇజ్రాయెల్‌ పార్లమెంటును ముట్టడిరచారు. ఆర్థిక కమిటీ సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చారు. అక్కడ బందీలు మరణిస్తుంటే విూరు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదని నిరసన వ్యక్తంచేశారు.
హమాస్‌ అగ్ర నేతలు గాజాను వీడొచ్చు: ఇజ్రాయెల్‌
జెరూసలెం: బందీలు విడుదల, ఇజ్రాయెల్‌`హమాస్‌ ల మధ్య పోరుకు విరామం ఇచ్చే విషయమై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌వైపు నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిపాదన వచ్చింది.కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ అగ్రనేతలు గాజాను విడిచిపెట్టి వెళ్లొచ్చని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం సూచించిందట. ఈమేరకు అంతర్జాతీయ విూడియా కథనం వెల్లడిరచింది.హమాస్‌ ఉగ్రదాడి తర్వాత.. ఆ మిలిటెంట్‌ గ్రూప్‌ను భూస్థాపితం చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అయితే తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎదురుదెబ్బలు తింటోంది. గ్రూప్‌ అగ్రనేతలను బంధించడం, మట్టుపెట్టడం చేయలేకపోతోంది. 70 శాతం హమాస్‌ దళం ఇంకా చెక్కుచెదరకుండా ఉందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హమాస్‌ అగ్రనేతలు గాజాను వీడితే.. ఈ ప్రాంతం బలహీనపడే అవకాశం ఉంది. దాంతో ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే ఉద్దేశంతోనే నెతన్యాహు ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.హమాస్‌ నేతలు ఖతార్‌, లెబనాన్‌తో సహా ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం హమాస్‌ అల్‌`కస్సం బ్రిగేడ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేప్‌ా అరౌరీ.. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్‌ చేపట్టిన డ్రోన్‌ దాడిలో మృతి చెందాడు. ఇజ్రాయెల్‌ బయటా హమాస్‌ నాయకత్వాన్ని వేటాడతామని నెతన్యాహు ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగానే ఈ దాడి జరిగింది. ఇక తాజా ప్రతిపాదన.. గాజా వెలుపల కీలక స్థావరాలపై దాడి చేయడానికి వీలు కల్పించనుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.