ఇస్కాన్‌కు భూముల లీజుపై రగడ

హైదరాబాద్‌: ఇస్కాన్‌ సంస్థకు జూబ్లీహిల్స్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను లీజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి దానం నాగేందర్‌ అక్కడకు చేరుకుని ఆలయ గేటుకు తాళం వేశారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు చోటుచేసోకుండా ఆ ప్రాంతమంతా పోలీసులు మోహరించారు. ఇస్కాస్‌కు ఇచ్చిన భూముల లీజును వెంటనే రద్దు చేయాలని భక్తులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.