ఉపాధి హామీలో డిమాండ్ మేరకు పని: మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
హైదరాబాద్: ఉనాధి హామీ పథకంలో ఈ నెల 19 నుంచి డిమాండ్ మేరకు పని కల్పించాలన్న నిబంధనను అమలు చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రకటించారు. పని కల్పించలేని వారికి నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, వేతనాల చెల్లింపులో ఆధార్ అనుసంధాన చెల్లింపులు అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇందిర జలప్రభతో 35 వేల మంది రైతుకూలీలను రైతులుగా మార్చామని తెలిపారు. రానున్న మూడేళ్లలో పది లక్షల ఎకరాల బంజర్లను ఈ పధకంలో సన్యశ్యామలం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల్లో 140 కోట్లకు పైగా నిధులు పక్కదోవపట్టాయని ఆందులో రూ. 62 కోట్లు దుర్వినియోగమయ్యాయని తెలిందన్నారు. దీనికి బాధ్యులైన దాదాపు నాలుగువేలమందిని తొలగించామన్నారు. దాదాపు 21 కోట్ల పై చిలుకు మొత్తాన్ని తిరిగి రాబట్టామన్నారు.